అమెరికా వీసా జారీకి సంబంధించిన నిబంధనలను US ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. డయాబెటీస్ (మధుమేహం), ఒబెసిటీ (ఊబకాయం), గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అమెరికా వీసా నిరాకరించాలని ఎంబసీలకు ఆదేశాలు పంపింది. అమెరికా సర్కార్ ఈ మేరకు అన్ని రాయబార కార్యాలయాలకు (ఎంబసీలకు) స్పష్టమైన ఆదేశాలు పంపింది.