TG: ప్రగతి భవన్ కేసీఆర్ విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఉపయోగపడిందని సీఎం రేవంత్ దుయ్యబట్టారు. కొడుకు భవిష్యత్తు, వాస్తు కోసమే రూ.2 వేల కోట్లతో కేసీఆర్ కొత్త సచివాలయం కట్టారని ఆరోపించారు. సచివాలయంలో ఏమైనా కొత్త ఉద్యోగాలు వచ్చాయా? అని నిలదీశారు. ప్రతిపక్షాలపై నిఘా పెట్టేందుకే కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మించారని వ్యాఖ్యానించారు.