రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుని.. పాకిస్తాన్‌తో సిరీస్‌లో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ప్లేయర్ క్వింటన్ డికాక్ అదరగొడుతున్నాడు. తాజాగా జరిగిన రెండో వన్డేలో భారీ శతకం(123*) సాధించాడు. దీంతో వన్డే కెరీర్లో 22 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా అత్యధిక శతకాలు సాధించిన కుమార సంగక్కర(23) తరువాత స్థానంలో నిలిచాడు.