కృష్ణా: కంకిపాడు మండలం మారేడుమాక గ్రామంలో ఎస్సీ కాలనీలో సుమారు రూ.20 లక్షల నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. ఎస్సీ సామాజిక వర్గ ప్రజలు తమ కుటుంబ, సామూహిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనువైన ప్రదేశం అవసరమనే ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించామని ఎమ్మెల్యే తెలిపారు.