KMM: ఇటీవల జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ – 2025 లో తనదైన ప్రతిభను ప్రదర్శించిన టీమ్ ఇండియా క్రికెటర్ అరుంధతి రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. భట్టి విక్రమార్క అరుంధతి రెడ్డిని సన్మానిస్తూ ఆమె విజయంపై అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణం అన్నారు.