ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC) వ్యవస్థ కుప్పకూలింది. దీంతో విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనివల్ల 500కి పైగా విమానాలు ఆలస్యం కాగా, షెడ్యూల్ చేసిన విమానాలన్నీ రద్దు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టులో భారీగా ప్రయాణీకుల రద్దీ నెలకొంది. కాగా, అధికారులు AMSSను పునరుద్ధరించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.