సత్యసాయి: మొట్టమొదటి ఉమెన్ వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ ఎన్. శ్రీచరణి స్వరాష్ట్రానికి వచ్చిన సందర్భంగా మంత్రి సవిత విజయవాడ ఎయిర్పోర్టులో ఆమెకు ఘన స్వాగతం పలికారు. మంత్రి సవితతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొని శ్రీచరణి ప్రతిభను ప్రశంసిస్తూ ఆమె విజయంపై గర్వం వ్యక్తం చేశారు.