కృష్ణా: విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మండవ జానకి రామయ్య (93) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం గన్నవరం శివారు రుషి వాటిక వృద్ధుల నిలయంలో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కాలం విజయ డెయిరీ ఛైర్మన్గా సేవలందించిన మండవ.. పాడి రైతుల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేశారు. ఈయన స్వగ్రామం మొవ్వలో ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.