బెంగళూరు వేదికగా సౌతాఫ్రికా-Aతో జరుగుతున్న రెండో అనధికార టెస్టు తొలి ఇన్నింగ్సులో భారత్-A తడబడుతున్నట్లు కనిపిస్తోంది. లంచ్ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 85 రన్స్ చేసింది. క్రీజులో కెప్టెన్ రిషభ్ పంత్(23), ధ్రువ్ జురెల్(19) ఉన్నారు. అంతకుముందు KL రాహుల్(19), అభిమన్యు ఈశ్వరన్(0), సాయి సుదర్శన్(17), దేవదత్ పడిక్కల్(5) వెనువెంటనే పెవిలియన్ చేరారు.