PDPL:పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ సభ్యులు అల్లెంకి సత్యనారాయణ తండ్రి అల్లెంకి భూమయ్య కన్నుమూశారు. భూమయ్య నేత్రాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. దీంతో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి టెక్నిషియన్ ప్రసాద్ నేత్రాలను సేకరించి, ఆసుపత్రికి తరలించారు. పుట్టెడు బాధలోనూ నేత్రదానం చేసినందుకు భూమయ్య కుటుంబ సభ్యులను అభినంచారు.