ఆస్ట్రేలియాతో 5 టీ20 సిరీసులో భాగంగా జరుగుతున్న నాలుగో మ్యాచులో భారత్ మరోసారి టాస్ ఓడింది. దీంతో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సిరీస్ సొంతం చేసుకునేందుకు ఇరుజట్లకు ఈ మ్యాచ్ ఫలితం కీలకం కానుంది. కాగా చివరి మ్యాచులో భారత్ టాస్ గెలవగా.. అంతకుముందు వరుస మ్యాచుల్లో ఓడుతూ వచ్చింది.