SKLM: కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా తెలుస్తుందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. కోటబొమ్మాలి మండలం కమలనాధపురం,నీలంపేటలలో ఇవాళ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా కోటి సంతకాల సేకరణలో ఆయన పాల్గొన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే నేడు వాటిని ప్రైవేటుపరం చేయడం సబబు కాదని మండిపడ్డారు.