భారత ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, ఫొటోగ్రాఫర్ అనునయ్ సూద్(32) కన్నుమూశాడు. అతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సూద్ చివరి పోస్ట్ లాస్ వేగాస్ నుంచి ఉండగా.. అతను USలో చనిపోయినట్లు తెలుస్తోంది. నోయిడాకు చెందిన అతను ఇప్పటివరకు 46 దేశాల్లో పర్యటించగా.. 2022-24లో వరుసగా మూడుసార్లు ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.