కోనసీమ: పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం అని, పేద కుటుంబాలు ఈ సహాయం ద్వారా తమ కష్టాల నుంచి కొంత ఉపశమనం పొందుతున్నారని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. వైద్య ఖర్చులతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ సీఎం సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న 26 మందికి మంజూరు అయిన రూ.11,24,543 ల చెక్కులను మండపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుళ్ల బాధిత కుటుంబాలకు అందజేశారు.