NLG: నార్కట్పల్లి మండల పరిధిలోని చెరువుగట్టు దేవస్థానంలో బుధవారం రాత్రి జ్వాలా తోరణం ఘనంగా నిర్వహించారు. ఈ క్షేత్రానికి సుప్రభాత సేవ నుంచే భక్తులు పోటెత్తారు. ఈ దేవస్థానంలో భక్తులకు సరైన వసతులు కల్పించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.