NLG: నల్గొండలో చికెన్ ధరలు కార్తీక మాసం అయినప్పటికీ తగ్గే సూచనలు కనపించడం లేదు. నెలరోజులుగా కిలో రూ.200కు పైగానే అమ్ముతున్నారు. బుధవారం స్కిన్లెస్ రూ.220–245, విత్ స్కిన్ రూ.200–215కు విక్రయించారు. కార్తీక మాసం మొదలైనా ధరలు యథాతథంగానే ఉండటంతో మాంసం ప్రియులు కంగుతింటున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే స్థాయిలో కొనసాగనున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.