KNR: సైదాపూర్ మండలంలో గత నెల 29న మెంథా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు మండలంలోని సోమారం, సైదాపూర్, వెన్కేపల్లి తదితర గ్రామాల్లో వరద తాకిడికి ప్రధాన రహదారులు కోతకు గురై ప్రమాదకరంగా మారాయి. దీంతో కోతకు గురైన రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రోడ్లకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.