NLR: కందుకూరు – సింగరాయకొండ రాత్రి పూట బస్సు సర్వీసు ఏర్పాటు చేశారు. కందుకూరు ఆర్టీసీ డిపోలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఈ బస్సును బుధవారం ప్రారంభించారు. ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి ప్రారంభమైన ఈ సర్వీస్ రైల్వే ప్రయాణికులకు బాగా ఉపయోగపడనుంది. ప్రజల విజ్ఞప్తిపై ఆర్టీసీ అధికారులతో చర్చించి వెంటనే చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.