WGL: ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ విద్యార్థుల కోసం ఈనెల 9న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సమగ్ర శిక్ష (SSA) ప్రకటించింది. ఈ జాబ్ మేళా హన్మకొండ ప్రాక్టీసింగ్ హైస్కూల్లో జరగనున్నట్లు పేర్కొంది. వృత్తివిద్యా, కోర్సులు (IT&ITES, M&E, అగ్రికల్చర్, బ్యాంకింగ్ తదితర) పూర్తిచేసిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ముఖ్య ఉద్దేశమని, సద్వినియోగపర్చుకోవాలని కోరారు.