JGL: జగిత్యాల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో ఉత్సవమూర్తులకు వెండి ఆభరణాలు సమర్పించారు. బుధవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సీతమ్మ వారికి వెండితో తయారుచేసిన హారం, కిరీటం, విల్లులు, ధనుస్సులు, ఖడ్గం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జడ్పీ మాజీ ఛైర్పర్సన్ దావ వసంత సురేశ్ పాల్గొన్నారు.