MBNR: జిల్లాలో తాగునీరు, అంతర్గత అండర్ డ్రైనేజీ వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 824 కోట్లు కేటాయించడం చాలా సంతోషదాయకంగా ఉందని మాజీ కౌన్సిలర్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గురువారం క్లాక్ టవర్ కూడలిలో ఆయన మాట్లాడతూ.. అభివృద్ధిలో మరో అడుగు ముందుకు వేసిందనీ, ఈ ప్రజా పాలనలో జిల్లా ఎక్కడ లేని విధంగా అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు.