KMR: జుక్కల్ మండలం లొంగన్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులను ఎంపీవో శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలని అవగాహన కల్పించారు. పాత ఇండ్లు, రేకుల షెడ్లు ఉన్నవారు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ సదుపటేల్, తదితరులు పాల్గొన్నారు.