ELR: రైతులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. కిసాన్ డ్రోన్ పథకం క్రింద ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేస్తున్న డ్రోన్లను గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో నిడమర్రు మండలం పెద నిండ్రకొలను గ్రామానికి చెందిన లబ్దిదారునికి అందజేయటం జరిగింది. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.