CTR: సోమల PHCని జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ గురువారం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఆసుపత్రిలోని ల్యాబ్, వివిధ రికార్డులను పరిశీలించారు. ఈ మేరకు జ్వరాలతో వచ్చే ప్రతి కేసును జాగ్రత్తగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. అనంతరం వర్షాకాలంలో దోమల పెరుగుదల వల్ల వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.