WG: జిల్లాకు నూతన కలెక్టరేట్ భవనం నిర్మాణం ఎక్కడ చేయాలనే అంశంపై కొంతకాలం పెద్ద వివాదం నడిచింది. జిల్లాలోని పెద్ద చర్చి ప్రదేశం అంశంగా కూడా ఈ వివాదం జరిగింది. ప్రస్తుతం ఆ వివాదాలు కనుమరుగై, కలెక్టరేట్ ఊసే లేకుండా పోయింది. భీమవరంలో నిర్మిస్తారా, ఉండిలో ఏర్పాటు చేస్తారా లేక నరసాపురానికి తరలిస్తారా అనేది తేలాల్సి ఉంది. అధికారుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.