AP: కాకినాడ జిల్లా పిఠాపురంలో మరోసారి కల్తీ నెయ్యి కలకలం రేపింది. కల్తీ నెయ్యి స్థావరంపై రెవెన్యూ అధికారులు దాడులు చేసి భారీగా నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. మాధవనగర్‌లో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారని వీహెచ్‌పీ నేత వెంకటేశ్వరరావు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పశువుల కొవ్వుతో నెయ్యిని తయారు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.