NZB: బోధన్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రధాన ద్వారం ముందు పరిస్థితి ఇది. లోపలికి వెళ్లేందుకు వీల్లేకుండా మురుగు నీటితో నిండి ఉంది. దీంతో మురుగు నిల్వతో దుర్గంధం వెదజల్లుతోంది. కార్యాలయానికి వచ్చే తాము నిత్యం ఇబ్బందులు పడుతున్నామని ఖాతాదారులు వాపోతున్నారు. ఈ సమస్యను బల్దియా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు.