TG: రాష్ట్రంలో హైవే పెట్రోలింగ్ ఊసే లేకుండా పోయింది. రోడ్డు ప్రమాదం జరిగితే క్షతగాత్రులను కాపాడే లక్ష్యంతో గత ప్రభుత్వం హైవే పెట్రోలింగ్ ఏర్పాటును ప్రతిపాదించింది. ఇందుకు రూ.30 కోట్లు కూడా మంజూరు చేసింది. కానీ అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. రోడ్డు ఇంజినీరింగ్ లోపాలను గుర్తించి సవరించడం, నిత్యం గస్తీ నిర్వహిస్తూ రహదారులపై వాహనాలు ఆగిపోకుండా చూడటం కూడా వీరి బాధ్యతే.