W.G: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లోని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పరిస్థితిని తెలుసుకునేందుకు జిల్లా యంత్రాంగం గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. కలెక్టర్ చదలవాడ నాగరాణి సహా 141 మంది అధికారులు 141 పాఠశాలల్లో తనిఖీలు చేశారు. ఇటీవల కుళ్లిన కోడిగుడ్లు బయటపడటంతో అధికారులు గుడ్లను నిశితంగా పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.