TG: ప్రయాణాల విషయంలో రాష్ట్ర ప్రజల మనసు మారుతోంది. గతంలో ఎక్కడికైనా వెళ్లాలంటే.. బస్సులు, బైకులు, స్కూటీలపై వెళ్లేవారు. కానీ పరిస్థితి మారింది. ఇప్పుడు ఎక్కువగా కార్ల వైపే మొగ్గుచూపుతున్నారు. 2014-15తో పోలిస్తే.. 2024-25 సంవత్సరంలో ద్విచక్రవాహనాల రిజిస్ట్రేషన్లు కేవలం 4.56 శాతం వృద్ధి చెందగా.. కార్ల రిజిస్ట్రేషన్లు ఏకంగా 69.76 శాతం పెరిగాయి.