ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. ఇవాళ ఉదయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్లో సాంకేతిక లోపం కారణంగా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో పలు విమానాలు అరగంటకు పైగా ఆలస్యంగా నడిచాయి. ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు ఈ విషయాన్ని వెల్లడించారు. ఏటీసీ సిస్టమ్లో సమస్య వల్ల ఈ జాప్యం జరిగినట్లు సమాచారం.