NZB: ఆర్మూర్ RTC బస్సు డిపో నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు(సూపర్ లగ్జరీ) ఈనెల 15న నడపనున్నట్లు DM రవికుమార్ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు డిపో నుంచి బస్సు బయలుదేరుతుందన్నారు. టికెట్ ముందస్తుగా బస్టాండ్లోని రిజర్వేషన్ కౌంటర్లో తీసుకునే సౌకర్యం ఉందన్నారు. ఆర్మూర్ పరిసర ప్రాంత ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని DM కోరారు.