కడప అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిన్న గంధం మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున ఇవాళ కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, ఎమ్మెల్యే మాధవి రెడ్డి, ఇతర అధికారులు నేడు చాదర్ సమర్పించనున్నారు. రాత్రి వన్ టౌన్ సర్కిల్ నుంచి ఊరేగింపుగా బయలుదేరి దర్గాకు చేరుకోనున్నారు.