స్విమ్సూట్ ధరించడం ఇష్టం లేక స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ‘డర్’ సినిమాను రిజెక్ట్ చేసినట్లు నటి రవీనా టాండన్ తెలిపింది. ఈ సినిమా ఆఫర్ మొదట తనకే వచ్చిందని పేర్కొంది. అయితే ఇందులో కొన్ని సీన్స్ తనకు అసౌకర్యంగా అనిపించడంతో పాటు కాస్ట్యూమ్స్ నచ్చలేదని వెల్లడించింది. చిన్న సన్నివేశంలో స్విమ్సూట్ వేసుకోమని చెప్పడంతో తాను ఒప్పుకోలేదని పేర్కొంది.