WGL: కోర్టు ఉద్యోగాలు ఇస్తామని నల్లబెల్లి ప్రాంత నిరుద్యోగులను మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం, మంచిర్యాల, కోరుట్లకు చెందిన ముగ్గురు వ్యక్తులు స్థానిక మధ్యవర్తి సహకారంతో ముచ్చింపులు, రంగాపురం, గుండ్లపహాడ్, నల్లబెల్లి గ్రామాల్లోని యువకుల నుంచి రూ.10 నుంచి 15 లక్షల వరకు వసూలు చేశారు. మొత్తం రూ.45 లక్షలు సేకరించినట్లు సమాచారం.