కోనసీమ: ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కోటి సంతకాల సేకరణ చేపట్టామని అమలాపురం వైసీపీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ చెప్పారు. అల్లవరం మండలం డీ. రావులపాలెంలో గురువారం రచ్చబండలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ తెలిపారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు.