ADB: గాదిగూడ మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం(TAGS) కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు సంఘం సభ్యుడు కుమ్ర భీంరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీల అభివృద్ధి కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. దీంతో ఆదివాసీలు, సంఘం సభ్యులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.