AP: కడపలోని అమీన్‌పీర్ దర్గాను ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దర్శించుకున్నారు. దర్గా ఉర్సు ఉత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కడప జిల్లాలోని అమీన్‌పీర్ దర్గాకు ప్రాముఖ్యత ఉంది. సర్వమతాలకు అతీతంగా భక్తులు ఆ దర్గాకు వెళ్లి ఉర్సు మహోత్సవంలో పాల్గొంటారు.