TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా బోరబండలో బండి సంజయ్ సభకు పోలీసులు అనుమతి రద్దు చేశారు. ఈ సాయంత్రం బోరబండలో జరగాల్సిన మీటింగ్కు అనుమతి లేదని తేల్చిచెప్పారు. దీంతో పోలీసుల తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మొదట సభకు అనుమతి ఇచ్చి మళ్లీ రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సభ జరిపి తీరుతామని.. కార్యకర్తలంతా రావాలని బీజేపీ పిలుపునిచ్చింది.