బీహార్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల వేళ ముజఫర్‌పూర్ జిల్లాలోని గైఘాట్ నియోజకవర్గ ప్రజలు ఓటింగ్ బహిష్కరించారు. దర్భంగా ప్రాంతంలో వంతెనలు, రోడ్లు, కనీస వసతులు కల్పించకపోవడంతో ఎన్నికలను బహిష్కరించాలని సుగ్రైన్ గ్రామస్థులు తీర్మానించుకున్నారు. దీంతో 161, 162, 170 బూత్‌ల్లో పోలింగ్ నమోదు కాలేదు. వారికి సర్దిచెప్పేందుకు ఎన్నికల అధికారులు రంగలోకి దిగారు.