AP: ఇటీవల మృతిచెందిన టీడీపీ సీనియర్ నేత, ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బారాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అంతకుముందు లోకేష్ కు ఎమ్మెల్యే వెంకటకృష్ణ రెడ్డి, పార్టీ నాయకులు స్వాగతం పలికారు.