SKLM: రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్-19 క్రీడా పోటీలలో విశాఖ జట్టు విజయం సాధించింది. బుధవారం శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన పోటీలలో 10 ఓవర్లలో విశాఖ,శ్రీకాకుళం జట్లు స్కోరు సమం చేయడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. అనంతరం సూపర్ ఓవర్లో శ్రీకాకుళం జట్టు 7 పరుగులు చేయగా.. విశాఖ జట్టు మూడు బంతులలో 8 పరుగులు చేసి విజేతగా నిలిచి ట్రోఫీ సొంతం చేసుకుంది.