SRCL: కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన పెడ్తనపెల్లి రాజయ్య అనే వృద్ధుడు బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. రాజయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో సమస్యలను భరించలేక ఇంట్లోని బాత్రూమ్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తుంది. మృతుడి కుమారుడు కనకయ్య ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్పై ప్రశాంత్ రెడ్డి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.