విశాఖ: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. స్టాంప్ పేపర్ లైసెన్స్ వెండర్లు, డాక్యుమెంట్ రైటర్లుగా తిష్ట వేసి ప్రజలను పీడిస్తున్నారు. పన్నులు, ఫీజులు, TDS చెల్లించినా ఆస్తి విలువను బట్టి 1% వరకు వారికి అదనంగా చెల్లించాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. చలానాలు, ఫీజులు నేరుగా చెల్లించే అవకాశం లేకుండా తమ ఖాతాల్లో జమ చేసుకుంటున్నారని ఆవెేదన చెందుతున్నారు.