కోనసీమ: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న భారత సివిల్ సర్వీసెస్ క్రీడల పోటీల రాష్ట్రస్థాయి షెడ్యూల్ విడుదల చేశారు. మొంథా తుఫాన్ కారణంగా వాయిదా పడిన ఎంపిక తేదీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రుద్ర వైకుంఠ రావు ప్రకటించారు. ఈనెల 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమలాపురం బాలయోగి స్టేడియంలో ఎంపికలు జరుగుతాయని తెలిపారు.