KNR: శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు కనుల పండువగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు ఆలయంలో భక్తిశ్రద్ధలతో శివారాధన చేసి ఓంకార స్వస్తిక్ త్రిశూల లింగ రూపంలో దీపాలను వెలిగించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించినారు. ఇట్టి కార్యక్రమంలో శ్రీ శివరామకృష్ణ భజన మండలి భక్తులు, శ్రీ వాలి సిగ్రీవ భజన మండలి భక్తులు పాల్గొన్నారు.