NDL: కొత్త జిల్లాలు, డివిజన్ల మార్పుచేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కీలక ప్రతిపాదనలు చేసింది. బనగానపల్లిని కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసే అంశంపై ఉపసంఘం చర్చించింది. మంత్రి BC జనార్దన్ రెడ్డి ప్రతిపాదన మేరకు ఈ అంశాన్ని పరిశీలించింది. అటు, కర్నూలు(D) ఆదోని మండలాన్ని విభజించి పెద్దహరివానం అనే కొత్త మండలం ఏర్పాటుపై ఈ సంఘం చర్చించింది.