HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. సాధారణంగా ఎన్నికల ముందు పార్టీ కండువాలు భుజాలు మారుతుంటాయి. ఉదయం ఒకటి ఉంటే.. సాయంత్రానికి చేతిలో మరో జెండా ఉంటుంది. గెలుపే లక్ష్యంగా పార్టీలు చేరికలను విపరీతంగా ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో అర్థం కావడంలేదని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.