SRPT: వానకాలానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వం కొనుగోళ్లను మాత్రం విస్మరించిందని రైతులు వాపోతున్నారు. దాదాపు ఇరవై రోజులుగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లారే కానీ ఒక్కటంటే ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదంటూ.. రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.