ప్రకాశం: వాగులో మహిళ మృతదేహం వెలుగు చూసిన సంఘటన కనిగిరి మండలం చీర్లదిన్నెలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీరామ్ తెలిపిన వివరాల ప్రకారం.. చీర్ల దీన్నే గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగురాలు కోపర్తి ధనమ్మ ఈనెల 6న గేదల మేపుకు పొలాల్లోకి వెళ్లి తిరిగి రాలేదు. నేటి ఉదయం గ్రామంలోని నేరెళ్ల వాగులో శవమై తేలింది. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.